మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూకుడు పెంచారు. వరుసగా సినిమాలను పట్టాలు ఎక్కిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. అలాగే మలయాళ సూపర్ హిట్ 'లూసీఫర్' రీమేక్‌లో నటించడానికి సన్నద్ధం అవుతోన్నాడు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. తమిళంలో అజిత్ కుమార్ నటించిన 'వేదాలం' సినిమాను మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా తొలుత సాయి పల్లవిని అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు మహానటి కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మెహర్ రమేష్‌తో పాటు చిరంజీవి కూడా కీర్తి సురేష్ సంప్రదించారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం షూటింగును నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో చిరంజీవి గుండుతో కనిపిస్తారని అంటున్నారు. అందుకే ఆమధ్య గుండు గెటప్ తో ట్రయిల్ ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో ఆయన వదిలారు. మెహర్ రమేష్ చివరిసారిగా 2013లో వెంకటేష్‌తో 'షాడో' సినిమా చేసారు....
0 Comments