నటులు: పవన్ కల్యాణ్, శృతి హాసన్, ప్రకాశ్ రాజ్, అంజలి, నివేధా థామస్, అనన్య
కథ:
స్నేహితులను నమ్మిన ఓ ముగ్గురు అమ్మాయిలు, ఆ తరువాత వారి చేతిలో మోసపోతారు. న్యాయం కోసం ఎందరో న్యాయవాదులను సంప్రదిస్తారు. కానీ ఓ ప్రముక వకీల్ సాబ్ వారికి ఏ విధంగా న్యాయం చేశాడన్నదే పూర్తి కథాంశం..
కథనం:
అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాలపై ఈ సినిమాలో దర్శకుడు వేణు శ్రీరామ్ రియాలిటిక్ గా చూపించారు. ఈ సినిమా స్టోరీ ఇదివరకే తెలిసిందే అయినా దర్శకుడు తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చూపించాడు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ ను లాయర్ పాత్రలో చూపించి అతనిచేత అదిరిపోయే డైలాగ్ లు చెప్పించాడు. ఇక కేవలం డైలాగ్ లకే పరిమితం కాకుండా పవన్ ఫైట్స్ ఆకట్టుకుంటాయి. ఇక కేవలం సెంటిమెంట్ ను మాత్రమే చూపించకుండా లవ్ ఎంటర్ టైన్మెంట్ తో రక్తి కట్టించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ కు చాలాకాలం తరువాత దర్శకుడు మంచి టేస్ట్ సినిమా అందించి వారి మన్ననలను పొందాడు.
సాంకేతిక వర్గం ఎలా ఉందంటే..?
ఈ సినిమా రిమేక్ అయినా దర్శకుడు వేణు శ్రీరామ్ ఏమాత్రం ఆత్మను చెడిపేయకుండా సినిమాను ఒక రేంజ్ లో తీసుకెళ్లారు. ఒక రీమేక్ సినిమాకు ట్రైలర్లో అంత రెస్పాన్స్ వస్తుందని సినీ వర్గాల్లో ఎవరూ ఊపించలేదనే చెప్పవచ్చు. ఇక ప్రముఖంగా చెప్పకునే మ్యూజిక్ సినిమాకు హైలెట్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే సంవత్సరం కిందే ‘మగువా మగువా’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన విషయమే. బ్యాక్ రౌండ్ మ్యూజిక్ లోనూ థమన్ ఏమాత్రం తీసిపోలేదు. ఫ్యాన్స్ లో తాను ఒకరంటూ చెప్పుకుంటున్న దిల్ రాజ్ ఈ సినిమా కోసం పెద్ద రిస్కే తీసుకున్నాడు. సినిమాకు పెద్ద ఖర్చు అనిపించకపోయినా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త... రెండేళ్ల విరామం తరువాత పవన్ కళ్యాణ్ నట…
0 Comments