స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ఎస్ఈసి అన్ని పార్టీలతో ఈరోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. వైసీపీ, జనసేన మినహా అన్ని పార్టీలు హాజరయ్యి అభిప్రాయాన్ని తెలియజేశాయి. అయితే, జనసేన పార్టీ తమ అభిప్రాయాన్ని మెయిల్ ద్వారా తెలియజేస్తామని తెలిపింది. చెప్పిన విధంగానే మెయిల్ ద్వారా జనసేన పార్టీ తమ అభిప్రాయాన్ని తెలియజేసింది. మార్చిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికల నిర్వహణలో కరోనా విషయంలో సిఈసి పాటించిన నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలని జనసేన పార్టీ సూచించింది.రాజ్యాంగబద్ద సంస్థగా ఉన్న ఎస్ఈసి తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని జనసేన పార్టీ తెలియజేసింది.
0 Comments