Ad Code

Advertisement

Responsive Advertisement https://www.highrevenuecpmnetwork.com/ytuge33e?key=bf171b1cab7788e5d4857f435d049aba

Random,Recent,Label Widget

random/hot-posts

పవన్ జనసేన ప్రయాణం లో మరో ఆటకం????

జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. ఇటు బీజేపీతో ఉండలేక, దాని నుంచి బయటకు రాలేక సతమతమవుతున్నారు.తెలంగాణలో బీజేపీపై పవన్ కల్యాణ్ కొంత స్పష్టత ఇచ్చినప్పటికీ ఏపీలో 




బీజేపీని వదలే అవకాశాలు ఇప్పట్లో లేనట్లే కన్పిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పవన్ అడుగులు ఎటు పడతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఒంటరిగా పోటీ చేసి..

పవన్ కల్యాణ్ తాను ఒంటరిగా పోటీ చేసి జగన్ ను ఎదుర్కొనలేనని గత ఎన్నికల్లోనే తెలిసిపోయింది. తన చరిష్మా కన్నా జగన్ ఇమేజ్ బాగా పనిచేసినట్లు ఎన్నికల ఫలితాలు చెప్పాయి.


గతంలో వామపక్ష, బీఎస్పీ పార్టీలతో కలసి వెళ్లినా ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కనీసం తాను కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయారు. దీనికి ప్రధాన కారణం జనసేనకు క్షేత్రస్థాయిలో క్యాడర్ లేకపోవడమే.

ఇప్పుడిప్పుడే క్యాడర్ లో కసి..

అయితే ఇప్పుడిప్పుడే జనసేన పుంజుకుంటుంది. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారంలో పాల్గొనకపోయినా గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుంది. బీజేపీ కంటే ఎక్కువ స్థానాలను సాధించింది. ఇప్పుడిప్పుడే క్యాడర్ లోనూ కసి పెరుగుతుంది. ఇక ఏపీలో బీజేపీ పరిస్థితిని చూస్తే నానాటికీ తీసికట్టులా తయారైంది. బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ ఎదుగుదలకు ఆటంకంగా మారుతున్నాయి.

బీజేపీతో వెళితే...

పవన్ కల్యాణ్ ఊహించింది వేరు. బీజేపీతో కలసి వెళితే కొంత బలం పెరుగుతుందని భావించారు. కానీ బీజేపీ తో కలసి వెళితే భవిష్యత్ ఉండదని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక వరకూ పవన్ కల్యాణ్ ప్రయాణం బీజేపీతో సాగే అవకాశముంది. ఆ తర్వాత మాత్రం చెప్పలేమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అదే సమయంలో టీడీపీతో పవన్ కల్యాణ్ కలసినా ప్రజలు హర్షించరన్న టాక్ కూడా ఉంది. మరి పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి......

Post a Comment

0 Comments

People

Ad Code

Responsive Advertisement