Ad Code

Advertisement

Responsive Advertisement https://www.highrevenuecpmnetwork.com/ytuge33e?key=bf171b1cab7788e5d4857f435d049aba

Random,Recent,Label Widget

random/hot-posts

భారీ వర్షాల,వరదల వల్ల నష్టపోయిన ఏపీ రైతులకు గుడ్ న్యూస్

భారీ వర్షాల వల్ల నష్టపోయిన ఏపీ రైతులకు గుడ్ న్యూస్


ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు రేపు (అక్టోబర్ 27) ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గత ప్రభుత్వాలు వరదలు వచ్చి రైతులు పంట నష్టపోయిన తర్వాత ఎప్పటికో ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేవని, చరిత్రలో తొలిసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత వేగంగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తోందన్నారు. రైతులకు సాయం చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అలాగే, వరదలకు, వర్షాలకు తేడా తెలియకుండా విమర్శలు చేస్తున్నారంటూ టీడీపీ నేత నారా లోకేష్ మీద మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ‘టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని ఎగ్గొట్టింది. జగన్ ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలు కూడా చెల్లించాం.’ అని వ్యవసాయ మంత్రి కన్నబాబు తెలిపారు. ఇదొక్కటే కాదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.1075 కోట్ల వడ్డీ లేని రుణాలను కూడా తిరిగి చెల్లించామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు ఎదురుకావడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమని కన్నబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు సరిపడా నిధులు డిమాండ్ చేయకుండా కేవలం కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి చంద్రబాబు తల ఊపడం వల్ల ఈ సమస్య వచ్చిందన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారం రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. నష్టం వివరాలు అంచనా మొత్తాన్ని లేఖలో వివరించారు. మొత్తం రూ. 4450 కోట్ల మేర ఆస్థినష్టం వాటిల్లిందని..తక్షణ సహాయంగా రూ.1000 కోట్లు విడుదల చేయాలని లేఖ ద్వారా కోరారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఆర్ధికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు , భారీ వర్షాలు ముంచెత్తాయన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని వైఎస్ జగన్ కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం కారణంగా రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు పడ్డాయి. ఈ నెల 13వ తేదీ ఒక్కరోజులోనే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది.ఏపీలో ఈ ఏడాది జూన్‌1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 27.9 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 26.71 శాతం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా.. కేవలం 4.62 శాతం మండలాల్లో మాత్రమే సాధారణం కంటే లోటు వర్షపాతం రికార్డయింది. కడప జిల్లాలో సాధారణం కంటే 67.7 శాతం అధిక వర్షపాతం నమోదైంది. తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాగా గుర్తింపు తెచ్చుకున్న అనంతపురం జిల్లాలో సాధారణం కంటే 58.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 460 మండలాల పరిధిలో అధిక వర్షపాతం, 79 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది...

Post a Comment

0 Comments

People

Ad Code

Responsive Advertisement