ఇప్పుడు సినిమాల షూటింగ్ విషయంలో దాదాపుగా అందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సినిమాలను కరోనా వైరస్ తగ్గిందా సరే కొంతమంది షూటింగ్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే కొంత మంది అగ్ర హీరోలు సినిమా షూటింగ్లో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి గా లేరు అని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే కొంత మంది స్టార్ హీరోలు ఈ ఏడాది సినిమా షూటింగులు వద్దు అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ముఖ్యంగా మహేష్ బాబు ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేకపోవచ్చు అని భావిస్తున్నారు
దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలియదు కానీ ఆయన మాత్రం ఇప్పుడు సినిమా షూటింగులకు కాస్త దూరంగానే ఉంటున్నారు. అయితే ఇంట్లో పిల్లల కారణంగానే ఆయన షూటింగ్ లకు వెళ్ళడం లేదని కొంతమంది అంటున్నారు. కృష్ణ కూడా మహేష్ బాబు తోనే ఉండటంతో ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మహేష్ బాబు సినిమా షూటింగులకు దూరంగా ఉంటున్నారని సమాచారం.
Also Read:
సూర్య కొత్త చిత్రం వాయిదా!!! కృష్ణ మరియు మహేష్ బాబు
కృష్ణ వయసు దాదాపు 80 ఏళ్లు కావడంతో ఆయనకు కరోనా వస్తే కోలుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మహేష్ బాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన కూడా విడుదల చేసి ఈ ఏడాది సినిమా షూటింగ్ ను ఆపేయాలని మహేష్ బాబు భావిస్తున్నాడట. ఇక చిరంజీవి కూడా ఈ ఏడాది సినిమా షూటింగ్ ల విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. దాదాపుగా చిరంజీవి వయసు 70 ఏళ్లు కావడంతో ఆయన కూడా సినిమా షూటింగ్ విషయంలో అంతగా ఆసక్తి లేరని తెలుస్తోంది. మరి షూటింగ్ ల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
0 Comments