. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతిని నాశనం చేయాలనే ఏకైక లక్ష్యం తో వైసిపి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. 315రోజులుగా రైతులు, మహిళల లు ఆందోళన చేస్తున్నా జగన్ స్పందించక పోవడం దారుణం అన్నారు. ఎప్పుడూ బయటకు రాని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. పోలీసులు తో కొట్టిస్తారా అని ప్రశ్నించారు. అనేక అక్రమ కేసులు పెట్టినా.. భయపడకుండా ఉద్యమం కొనసాగిస్తున్నారన్నారు. ఇప్పటికే అనేక మంది రైతులను జైలుకు పంపారన్నారు.
అమరావతి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా కార్యక్రమం చేపడితే మళ్లీ కేసులు పెట్టారు అన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడమే కాక, తీవ్రవాదులు కు తరహాలో రైతులకు సంకెళ్లు వేయడం నీచమైన చర్య అని మండిపడ్డారు.
అన్నదాతలను ఏవిధంగా ఈ ప్రభుత్వం చూస్తుందో ఆలోచించండని ఆయన హితవు పలికారు. అమరావతి అనుకూలంగా ఉద్యమం చేసినవారిని అణచివేయాలని జగన్ చూస్తున్నారని అన్నారు. ఏపీ లో పోలీసులు రాజ్యం నడుస్తుంది... వారిని అడ్డం పెట్టుకొని జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఈ ఘటనల పై జాతీయ మానవుల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేసారు. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటామన్న కూఢా.. పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం సరి కాదన్నారు. న్యాయ పరంగా కూడా పోలీసులు, ప్రభుత్వం పై పిటీషన్ వేస్తాం అన్నారు. జిఒ నెంబర్ 21 ప్రకారం ప్రజలపై ఫైన్ల భారం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది అని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు ప్రజల నుంచి చిన్న తప్పులకే భారీ జరిమానాలు వేస్తారా అని నిలదీశారు. దీని వల్ల అవినీతి మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. సాక్షి పత్రిక లో ఇష్టం వచ్చినట్లు గా యాడ్ ల రూపంలో ప్రభుత్వ సొమ్మును కూడపెడుతున్నారని ఆయన అన్నారు. భరత్ అను నేను సినిమా ప్రభావం తో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని ఆయన వ్యాఖ్యానించారు.
0 Comments