Ad Code

Advertisement

Responsive Advertisement https://www.highrevenuecpmnetwork.com/ytuge33e?key=bf171b1cab7788e5d4857f435d049aba

Random,Recent,Label Widget

random/hot-posts

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడా లేక ఆగిపోతాడా???

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా ఈ చిత్రం కు సంబంధించి ఇప్పుడు కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది.



చాలా కాలం తర్వాత పవన్ నుంచి రానున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 90 శాతం వరకు షూట్ పూర్తి కావచ్చింది. కానీ ఇప్పుడు సినిమా విడుదల ఎప్పుడు అవుతుంది అన్నది మాత్రం పెద్ద సస్పెన్స్ లా మారింది. ముఖ్యంగా చిత్ర యూనిట్టే ఇప్పుడు మౌనం పాటిస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ లో మరింత సస్పెన్స్ నెలకొంది.

ఇప్పటికే సంక్రాంతి రేస్ లో మీడియం సినిమాలతో నిండిపోయింది. దీనితో ఈ చిత్రం అసలు ఈ రేస్ లో ఉన్నట్టా లేనట్టా ఎప్పుడు విడుదల అవుతుంది అని అనేక అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. మరి పవన్ ఈ రేస్ లో ఉన్నారో లేదో అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.


Post a Comment

0 Comments

People

Ad Code

Responsive Advertisement