Ad Code

Advertisement

Responsive Advertisement https://www.highrevenuecpmnetwork.com/ytuge33e?key=bf171b1cab7788e5d4857f435d049aba

Random,Recent,Label Widget

random/hot-posts

రూ.20వేల కోట్లతో నిర్మాణం ఎలా సాధ్యం? పోలవరంపై నరేంద్ర మోడీ కి జగన్ లేఖ

పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు ఇవ్వడానికి కేంద్రం విముఖత ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. పాత ధరల ప్రకారమే రూ.20,398 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధం కావడంతో ఈ మొత్తంతో ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. భూసేకరణ, పునరావాసానికే రూ.29 వేల కోట్లు అవసరమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తేల్చిచెబితే కేవలం రూ.20వేల కోట్లతో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. పోలవరం తాజా పరిణామాలపై శనివారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు.

ఈ నిధులతో ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమన్న సీఎం.. నిర్మాణ బాధ్యతలను కేంద్రాన్నే తీసుకోమందామని కూడా వ్యాఖ్యానించినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సర్వసభ్య సమావేశంలో కూడా రాష్ట్రం తరఫున ఇదే వాదన వినిపించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.47,725.74 కోట్లు ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు లేఖ రాయాలని నిర్ణయించారు. అలాగే, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లకూ లేఖలు పంపాలని తీర్మానించారు.

పోలవరం అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా కమిటీ, రివైజ్డు కాస్ట్‌ కమిటీ 2017-18 ధరలతో ఆమోదించిన అంచనాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదించి పంపిన ప్రతిపాదనలను కేంద్ర జలసంఘం పరిశీలించి, సాంకేతిక సలహా కమిటీ ముందు ఉంచింది. కేంద్ర జలశక్తి కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన సాంకేతిక సలహా కమిటీ ఆ ప్రతిపాదనలను రూ.55,448.87 కోట్లకు ఆమోదించింది.
తర్వాత రివైజ్డు కాస్ట్‌ కమిటీ ఇవే ప్రతిపాదనలను రూ.47,725.74 కోట్లకు ఆమోదించి సిఫార్సు చేసిన విషయాలను ప్రస్తావిస్తూ అన్ని స్థాయిల్లో ఆమోదం లభించిన ఈ మొత్తాన్ని పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాలని కేంద్ర పెద్దలను కోరాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం నిర్మాణ బాధ్యతలనే తీసుకుందని, అదీ కేంద్రం ఆధ్వర్యంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో ఈ పని చేస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు, ప్రాజెక్టు పూర్తిచేసేందుకు వీలుగా సిఫార్సు మేరకు రూ.47,725.74 కోట్లు ఇవ్వాలని కేంద్రాని కోరదామని ముఖ్యమంత్రి సూచించారు.

Post a Comment

0 Comments

People

Ad Code

Responsive Advertisement